There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
"Don't let suffering kills your confidence!"
మనిషంటే కేవలం రక్త-మాంసాలు కూడిన దేహమే కాదు.. పలురకాల భావాలు (feelings), భావోద్వేగాలతో (emotions) నిండిన మనసు కూడా! కొన్ని భావాలను మనం అదుపు (control) చేయచ్చు.. కానీ, కొన్ని అలా చేయలేము!
ఉదాహరణకి బాధ.. ఏ విషయం గురించి బాధ పడుతున్నాం అనే దానినిబట్టి దాని మీద మన నియంత్రణ (control) ఎంతనేది ఆధారపడి ఉంటుంది! అంటే, ఆ నిర్దిష్టమైన (particular) విషయానికి ఆ మనిషి ఇచ్చే విలువని బట్టి ఆధారపడి ఉంటుంది!
కానీ, ఈ బాధ అనే భావం మనిషి జీవితాన్ని చాలా ప్రభావితం (impact) చేస్తుంది. దీనికి వ్యతిరేక భావమైన సంతోషం కూడా అంతే! సంతోషం మంచిగా ప్రభావితం చేస్తే.. బాధ చెడుగా ప్రభావితం చేస్తుంది. అంటే, మనిషిని అన్ని రకాలుగా బలహీన పరుస్తుంది! తనకున్న బలాలను మర్చిపోయేలా చేస్తుంది! ఎప్పుడైతే మనిషి ఆ బాధకి లొంగిపోయాడో, తనకున్న బలాల్ని మర్చిపోయాడో.. ఆ క్షణం నుండి తన జీవితంలో ఒకొక్కటి కోల్పోతూ వస్తాడు.. చివరికి రక్త-మాంసాలతో కూడిన దేహం తప్ప.. మనసంటూ ఏమీ మిగలదు! అంతా ఖాళీ.. అంతా సూన్యం!
కానీ, ఎవరైతే ఆ బాధని దిగమింగి ముందుకి నడవగలుగుతారో.. వారు తమ జీవితంలో అనుకున్నది సాధిస్తారు! అలాంటి వారికి జీవితంలో ఓటమి అనేదే ఉండదు! ప్రాణం పోయాక కూడా నలుగురూ ఆదర్శంగా చెప్పుకునేలా ఉంటుంది వారి కథ!
{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach