"Life is not about achieving success, it's all about grabbing opportunities to become successful. Most people ignore some opportunities due to negative thinking."
జీవితంలో గెలవాలి అని, ఉన్నతంగా ఎదగాలి అని అందరికీ ఉంటుంది. కానీ, కొందరే వారికి ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, వాటిని సద్వినియోగం చేసుకుని విజయాలు సాధిస్తారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకని వాళ్లు success కాలేకపోతున్నారు?
ఎందుకంటే, వాళ్లు ఓ అవకాశం వచ్చినప్పుడు అది చిన్నదా, పెద్దదా? లేదా అది చేయొచ్చా, చేయకూడదా? చేస్తే ఏమవుతుంది? ఇలా ఆలోచిస్తూ సమయాన్ని గడిపేస్తారు. అవకాశం చిన్నదైనా, పెద్దది అయినా అది వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే, ఏది ఎప్పుడు మనకి విజయానికి దారి చూపిస్తుందో మనకి తెలీదు. అలాగే, నువ్వు ఆలోచించేలోపు ఆ అవకాశాన్ని మరొక్కరు వినియోగించుకుని నీ కళ్ళ ముందే విజయ బావుటా ఎగురవేస్తారు. అప్పుడు నువ్వు పశ్చాత్తాపపడినా లాభం ఉండదు!
అదే విధంగా ఒక
అవకాశం ఎంత వరకు మంచిది అని ఆలోచించడం మంచిదే. కానీ, దానికి కూడా ఓ హద్దు ఉంటుంది. మితిమీరిన అనుమానంతో కాలయాపన చేస్తే సమయం వృధా అవుతుంది.
మరి ఈ విషయంలో ఓ సగటు మనిషికి ఎదురయ్యే అడ్డంకులు ఎలా అధిగమించాలి అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి!
ఇలాంటి మరిన్ని విలువైన సమాచారం కోసం మా ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి!