There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
"It is You Who Can Change You!"
ఈ లోకంలో ఉండే ప్రతీ ఒక్కరూ ఏదోక సమయంలో కష్టాలను ఎదుర్కొంటారు. అది దేనికి సంబంధించిందైనా కావచ్చు. పరీక్షలలో ఫెయిల్ అవ్వడం, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం, ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా సమస్యలు, సామాజిక పరంగా ఎదురయ్యే ఇబ్బందులు ఇలా అనేకానేక విధాలుగా ఇక్కట్లు (struggles) పాలవుతుంటాడు మనిషి.
అయితే ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ, మనం వాటన్నింటినీ అధిగమించి (overcome) ముందుకు ఎలా వెళ్లాలి అనేది కేవలం మన చేతుల్లోనే ఉంటుంది. అయితే ఇలా జీవితంలో విజయం సాధించేందుకు అవసరమయ్యే లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం.
మనం చేసే ప్రతీ పనిపై పట్టుదల మరియు సంకల్పం (will power) ఉన్నంతవరకు, మనం వాటిని మరింత మెరుగ్గా, అలాగే సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలం. దృఢమైన సంకల్ప బలం, కృత నిశ్చయం (consistency) తోడుంటే మరేది అవసరం లేదు.
ఇతరులు ఏమనుకుంటున్నారో మనకు అనవసరం. ఎందుకంటే ఓ వ్యక్తిపై అందరికీ ఒకేలాంటి అభిప్రాయం ఉండదు. చూసే దృష్టిని బట్టి, ఆ పరిస్థుతలను బట్టి మనం ఒకొక్కరికీ ఒకొక విధంగా అర్థమవుతాం. అంతమాత్రాన ఎవరో పొగిడారని పొంగిపోవటం, గర్వపడటం, అలాగే ఎవరో నిందించారనో, దూషించారనో బాధపడటం, దాని గురించే పదే పదే ఆలోచించడం, మనల్ని మనం తక్కువచేసి చూసుకోవడం ఈ రెండూ మీ పతనానికి (downfall) దారి తీస్తాయి. అందుకే ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో చూసి కలవరపడటం (worry) మానేయాలి. అప్పుడే మీ లక్ష్యాలపై మీరు పూర్తి శ్రద్ధ పెట్టగలరు.
మీ మనస్సుకి మించిన శక్తి మరొకటి ఈ ప్రపంచంలో లేదని మీరు అర్థం చేసుకోవాలి. ఇతరేతర ఆలోచనలు పెట్టుకోకుండా, ప్రస్తుతం ఏ కార్యానికైతే పూనుకున్నారో, దాని మీదే సంపూర్ణ దృష్టి కేంద్రీకరించడం (focus) ద్వారా, మీరు మీ జీవితాన్ని మరియు ఈ ప్రపంచాన్ని మార్చవచ్చు. ముఖ్యంగా ఇతరుల అభిప్రాయాల వల్ల మీ మనస్సు కలుషితం కాకుండా చూసుకోవాలి. మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి అని మీరు మిమ్మల్ని మీరు నమ్మాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆత్మా విశ్వాసం కోల్పోకూడదు.
{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach