"ఏకాగ్రత ఉంటే ఎంత కఠినమైన లక్ష్యాన్నైనా సాధించగలం"

ఏ సాధనకైనా (practice), ఏ పనికైనా మనకి ఏకాగ్రత (concentration) ఉండాలి. ఏకాగ్రత లేకపోతే ఏ పనీ సవ్యంగా సాగక ఇబ్బందులకు గరవుతుంటాం. మనసు చుట్టూ ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. వీటిని పక్కనపెట్టి ఏకాగ్రతతో పనిచేయకుంటే మనకు ఫలితం దక్కదు.

అదే విధంగా, ఒక సమస్యకు పరిష్కారం దొరకాలంటే కూడా ఏకాగ్రత చాలా అవసరం. ఇది ఆలోచనాశక్తిని పదును పెడుతుంది. ఏకాగ్రతకు మూడు శక్తులు ఉంటాయని యోగసాధన చేసినవారు చెబుతున్నారు. సమస్యకు పరిష్కారం దొరకడం ఏకాగ్రతకు ఉన్న మొదటి శక్తి. ఏకాగ్రతతో సంకల్పం చేసుకుంటే ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు.. ఇది రెండో శక్తి. మన లక్ష్య సాధనకోసం మనం చేసే ప్రయత్నాలు ఉన్నతంగా ఉండాలి.. ఇది మూడో శక్తి.

భావోద్వేగాలను నియంత్రించుకోవాలన్నా (control), కోపావేశాలను అదుపులో ఉంచుకోవాలన్నా, ఏకాగ్రత, సంకల్పబలం ఎంతో అవసరం, ముఖ్యం అని మనం తెలుసుకోవాలి. ఉన్నత ప్రమాణాల ( high quality thinking కి) జీవనానికి ఏ పనిలో ఐనా ఏకాగ్రత ఉండాలి.. అప్పుడే మనం ఎంత కఠినమైన లక్ష్యాన్నైనా సాధించగలం అని యోగ గురువులు చెబుతారు.

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach