"Focus on the things that are in your control" — Venu Kalyan

ప్రతీ ఒక్కరికి ఓ లక్ష్యం ఉంటుంది. కానీ, మనలో చాలా మందికి ఎంత ప్రయత్నించినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. కాలం గడిచేకొద్దీ ఓ నిరాశ మొదలవుతుంది మనలో. ఆ విధంగా చాలా మంది ప్రయత్నాన్ని మధ్యలోనే విరమించుకుంటారు. ఇలా జరగడానికి ఓ కారణం మన చుట్టూ ఉండే ప్రతికూల పరిస్థితులు (Negative Situations). పరిస్థితులు సహకరించనప్పుడు సహనం వహించడం తప్ప మన చేతుల్లో ఏమీ ఉండదు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో సహనం అనేది వీడకూడదు. ఎందుకంటే, చేసిన కష్టం ఎన్నటికీ వృధా పోదు. కొందరి విషయంలో అది కాస్త ఆలస్యం కావచ్చు... కానీ, కచ్చితంగా కష్టానికి తగ్గా ఫలితం వస్తుంది.

ఇంకో కారణం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడటం. ఆధారపడటం అనేది చాలా భయంకరమైన అలవాటు. ఎందుకంటే, మీరు ఎవరి మీదైనా ఆధారపడితే, మీ విజయం వాళ్ల చర్యల మీద కూడా ఆధారపడి ఉంటుంది. వాళ్ల చర్యలు మీరు నియంత్రించలేనప్పుడు (control), వారిని ఆధారం చేసుకుని ఎలా ముందుకి వెళ్ళగలరు, ఎలా లక్ష్యాన్ని సాధించగలరు?

ఈ విధంగా ఒకరి మీద ఆధారపడటం వల్ల ఇంకా ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, అది మన జీవితం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలియాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి!

ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ ని SUBSCRIBE చేసుకోండి!

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach