"అహంకారం మనుషుల మధ్య ఉన్న సంబంధాలను 

సమూలంగా నరికే ఒక ఆయుధం!"

అది మనిషిలో కలిగితే తద్వారా ఆ మనిషిలో గర్వం, పొగరు ఏర్పడి ఆ మనిషి అహంభావిగా మారి తనకు తానుగా నష్టపోతు ఎదుటివారికి నష్టాన్ని కలిగించే పరిస్థితికి లోనౌతాడు .

అహంకారం ఉన్న వారు ఎదుటి వారిని నిర్లక్ష్యం చేయడం, వారు ఆ నిర్లక్ష్యం భరించలేక పగ, ద్వేషం పెంచుకుని అవకాశం వచ్చిన చోట వీరికి నష్టం కష్టం కలిగించడం లాంటి చర్యలు చేయడం వల్ల అహంకారానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఏర్పడి, వ్యవహారాలు చెడి వారి మధ్య ఉన్న సంబంధాలు దెబ్బ తినడం జరుగుతుంది.

అహంకారానికి బదులు మనసులో ఆప్యాయత పెంచుకోగలిగితే మనుషుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడి, పనులు సక్రమంగా జరగడమే గాక చుట్టూ ఉన్న మనుషులు మంచి భావంతో ఉండి, అనుకున్న దానికంటే ఇంకా గొప్ప ఫలితాలు సాధించడానికి దోహదపడతారు.

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach