"Peace of Mind Can Be Achieved Through The Art of Balancing Emotions!" 

మనఃశాంతి... ఇది ఈ ప్రపంచంలో ఉండే ప్రతీ మనిషికీ ఎంతో అవసరం. ఇది లోపించడం వలనే ఎందరో జీవితాలు తలకిందులు అవుతున్నాయి, ఎన్నో అవరోధాలకు (Obstacles), నష్టాలకు దారి తీస్తుంది. ఇలాంటి ఓ పోటీ ప్రపంచంలో పరుగు పెడుతూ, చుట్టూ ఉండే మనుషుల కుయుక్తులకు (tricks), ఇంటా బయట బాధ్యతలు, పని ఒత్తిడి ఇలా వీటికి లొంగిపోకుండా జీవించగలటం అంత సులభం కాకపోయినా, మన మనస్సుని మన చెప్పుచేతల్లో (control) పెట్టుకోగలిగితే మనం మనః శాంతిగా జీవించగలం. ఇప్పుడు మనలో ఎలాంటి స్వభావాలు, లేదా లక్షణాలు ఉంటే మనం మనశ్శాంతిగా ఉండగలమో ఇప్పుడు చూద్దాం...

  • తరుచూ హాయిగా నవ్వుతూ ఉండటం
  •  ప్రతీ మనిషిలో ఉండే ప్రతిభను గుర్తిస్తూ, ప్రోత్సహిస్తూ ఉండటం 
  •  ఇతరులను ఎలాంటి వారని నిర్ధారించటంలో (in judging others) ఆశక్తి లేకపోవటం
  •  ప్రతీ చిన్న విషయానికి ఆందోళన చెందకుండా ఉండగలటం
  •  భయంతో కాకుండా ఆశతో జీవించగలటం, ప్రతీ క్షణాన్ని ఆనదించగలటం
  •  ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రేమను ఇవ్వగలటం, పొందగలటం
  •  ఉన్నదాంట్లో ఎంతో కొంత లేనివారికి పంచే స్వభావాన్ని కలిగి ఉండటం

ఈ లక్షణాలు మీలో ఉన్నట్లయితే, మీరు మనః శాంతిగా జీవిస్తున్నారని, మీరెంతో అదృష్టవంతులని అర్ధం! వీటిలో కొన్ని అంత సులువుగా రావు. కానీ, అభ్యాసం (practice) చేస్తే నిదానంగా వీటిని మన జీవితాల్లో భాగం చేసుకోవచ్చు, తద్వారా మనశ్శాంతిగా బ్రతకచ్చు.

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach