విషం కలిగిన నాలుకలు చెప్పే తప్పుడు మాటల ప్రభావం (impact) పడకుండా నీ బుద్దిని,
కలుషిత వాతావరణం (negative surroundings) చుట్టుముట్టినప్పుడు పక్కదారి పట్టకుండా (deviation) నీ ఆలోచనల్ని,
స్వార్ధపు మనుషుల మాయలో పడి భగ్నం (hurt) కాకుండా నీ మనసుని, ప్రతికూల పరిస్థితులు (negative situations) ఎదురైనప్పుడు వాటికి లొంగిపోయి కుంగిపోకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని...
మంచితనం అనే మఫ్టీలో తిరిగే మోసగాళ్ల నుండి,
ఆకారాన్ని తప్ప నీ ఆకలిని,
అందాన్ని తప్ప నీ ఆవేదనని,
ధనాన్ని తప్ప నీ గుణాన్ని,
నీతో అవసరాన్ని తప్ప నీ ఆనందాన్ని పట్టించుకోని, లెక్కచేయని, విలువివ్వని మనుషుల బారి నుండి నిన్ను,నీ ఆత్మగౌరవాన్ని సంరక్షించుకో!
ఓ మనిషి తనని తాను సంరక్షించుకోగలిగినప్పుడే (self-protection) ...