"Failure is the World's Best Teacher!"

ఒకరి జీవితం మరొకరికి మార్గదర్శకం (guidance/inspiration) కావచ్చు, లేదా హెచ్చరికగానూ (warning) ఉండవచ్చు. ఒకరిని చూస్తే ఇలాగే జీవించాలేమో అనిపిస్తుంది, మరొకరిని చూస్తే, ఇలా అస్సలు బ్రతకకూడదు అని అనిపిస్తుంది. నేర్చుకోవాలన్న ధ్యాస ఉండాలే గానీ, ప్రతీదాని నుండి, అది వస్తువైనా, మనిషైనా, పశువైనా, చిన్నదైనా, పెద్దదైనా, వాటి నుండి ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.

పుస్తక పఠనం (book reading) ద్వారా ఎంత నేర్చుకున్నా, మనుషులను చదివినప్పుడు నేర్చుకున్నంత సాధ్యపడదు. నాన్ననుంచి క్రమశిక్షణ, అమ్మనుంచి సందర్భానుసారంగా (based on situation) మెలిగే నాయకత్వ లక్షణాలు (leadership qualities), తోబుట్టువుల నుంచి క్షమ ఇలా ప్రతీ ఒక్కరి దగ్గర నుండీ ఎన్నో నేర్చుకోవచ్చు.

మీరా నుంచి భక్తి, హనుమ నుంచి అంకిత భావం (dedication) స్టీవ్‌ జాబ్స్‌ (Steve Jobs) నుంచి అసాధ్యాన్ని సుసాధ్యం (possible) చేయడమెలా, ఎడిసన్‌ నుంచి పట్టుదల, నిరంతర సాధన (continuous practice) ఇలా ప్రతీఒక్కరి జీవితం మనం ఏదోక విలువైన లక్షణమో, పాఠమో నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది.

కాబట్టి, మనిషి సజీవంగా ఉన్నంతకాలం, తనలోని విద్యార్థి కూడా సజీవంగా (alive) ఉంచడమనేది కీలకం. చాలామందిలో పాఠశాల రోజులతోనే నేర్చుకోవడం ఆగిపోతుంది. మనిషిలో శక్తిసామర్థ్యాలు పెరగాలన్నా, ఆరోగ్యంగా ఎదగాలన్నా, అధ్యయనం (practice) జీవితాంతం సాగాలి. ఎదురయ్యే సంఘటనల నుంచి గ్రహించేదంతా అనుభవం అవుతుంది. అది మనిషిలోని పరిపక్వతను (maturity) అనగా మెచ్యురిటీని పెంచుతుంది.

ఐన్‌స్టీన్‌, ఆర్కిమెడిస్‌, న్యూటన్‌ పరిశోధనలు మానవ జీవనశైలినే మార్చేశాయి. కానీ, ఆ పరిశోధనలకి ముందుగా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. కొత్త కొత్త పరిస్థితులు ఎదురైనప్పుడే అర్థం అవుతుంది మనిషికి, మనలో ఏ మేరకు పరిపక్వత (maturity) ఉందన్న విషయం.

జీవితం ఎప్పుడూ ముందు పరీక్ష పెడుతుంది. ఆ తరవాతే పాఠం నేర్పుతుంది. కొందరికి నెలలు, ఏళ్లు పడితే, మరికొందరికి జీవితకాలం సరిపోదు. జయాపజయాలు, మంచి చెడులు, అనుకూల ప్రతికూలాలు (positves and negatives),ఇలా రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రతి అనుభవం ఒక పరీక్షే. అవన్నీ ఎలా ఉండబోతుందో తెలియని రేపటికి మనిషిని సిద్ధం చేయడానికి విజయం ప్రేరణ ను (encouragement) అందిస్తే , పరాజయం (failure) బోధకుడి (teacher) పాత్ర పోషిస్తుంది. మనిషి తాను చేసిన పొరపాట్లకు మానసికంగా కుంగిపోతే బతుకు భారమనిపిస్తుంది. అదే వాటినుండి నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టి, జీవితాన్ని మెరుగుపరచుకుంటే మనిషి ముందుకు సాగిపోగలుగుతాడు.

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach