"Half Knowledge is more dangerous than no knowledge"

మీరు లైఫ్ లో దేని మీదా సరిగ్గా ధ్యాస (focus) పెట్టలేకపోతున్నారా? ఏ పని ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదా? లైఫ్ ఎటు పోతుందో అని దిగులుగా ఉందా? అలా ఎందుకు జరుగుతుంది, కారణాలేంటి? దానికి బీజం ఎక్కడ పడింది? అనే విషయాలు తెలియాలి అంటే ఇది పూర్తిగా చదవండి!

ప్రతీ మనిషి లోనూ ఏదొక ప్రతిభ దాగి ఉంటుంది. ఏ ప్రతిభ లేకుండా ఏ మనిషి ఉండడు. అయితే, చాలా మంది తమలోని ప్రతిభని గుర్తించ లేకపోతున్నారు, లేదా ఆలస్యంగా గుర్తిస్తున్నారు. సరిగ్గా చెప్పాలంటే, సరైన సమయానికి తమలో ఉన్న ప్రతిభను గుర్తించి, దానికి తగ్గట్టు నడుచుకోకపోవడం వలన ఎంతోమంది జీవితాలు వృధాగా పోతున్నాయి, లేదా సాధారణంగా గడిచిపోతున్నాయి. అలా జరగకుండా ఉండాలి అంటే, వీలైనంత త్వరగా మీరు మీ ప్రతిభను గుర్తించాలి, దాన్ని ఆధారంగా మీ జీవితాన్ని రూపకల్పన చేసుకోవాలి!

ప్రతిభని ఎలా గుర్తించాలి? 

 మనం రోజూ చేసే రకరకాల పనుల్ని, మన ఇతర చర్యల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకున్న సామర్థ్యాలు(capabilities), బలాలు(strengths), ఏదైనా ఓ పనిని చేయడంలో మనకుండే నైపుణ్యం(skill)... ఇలాంటివి తెలుస్తాయి. అందరూ అన్నీ కచ్చితంగా చేయలేరు. కానీ, ప్రతీ ఒక్కరి లో ఏదొక ప్రత్యేకత(speciality) ఉంటుంది. ఒకరు ఎంత క్లిష్టమైన(hard topic ni ayina) అంశాన్నైనా సునాయాసంగా(easy ga) అర్థం చేసుకోగలిగితే, అర్థం చెసుకున్న దాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకోగలిగితే, మరొకరు ఎంతో క్లిష్టమైన(hard topic) అంశాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించ(explain cheyagalige) గలిగే సమర్థత ఉంటుంది.

ఆ విధంగా ఒకరికి విపరీతమైన జ్ఞాపకశక్తి(memory power) కలిగి ఉంటే, మరొకరు అందరినీ ఆకట్టుకునే వాక్చాతుర్యాన్ని(talking power) కలిగి ఉంటారు. ఒకరు శ్రావ్యంగా(manchiga or chakkaga) పాడగలిగితే, ఇంకొకరు కనుల విందుగా (baga) ఆడగలుగుతారు. ఇలా మనకుండే ప్రత్యేకతలు(specialities), సామర్థ్యాలు(capabilities), నైపుణ్యాలే(skills) మన ప్రతిభా పాటవాలు(our talents). ఇవి కొన్ని మనకు అసంకల్పితంగా(involuntary or by default) వస్తే, మరికొన్ని పరిస్థితుల ప్రేరణ (due to situations) వల్ల మనలో పుడతాయి.

ఆ రకంగా మనలో ఉన్న ప్రతిభని(talent ni) మనం గుర్తించాక... ఆ ప్రతిభను ఆధారంగా మన జీవితంలో ఎలా పురోగతి(development) సాధించాలనే విషయాన్ని అధ్యయనం(study) చేయాలి, ఓ ప్రణాళికా బద్ధంగా (o plan prakaram) ముందుకు సాగాలి.

ప్రతిభను గుర్తించకపోతే ఏమవుతుంది? 

 మనలో ఉండే ప్రతిభను గుర్తించకపోతే... మన చుట్టూ ఉండేవాళ్లు ఏం చెబితే దాన్ని అనుసరిస్తూ(follow avutu) ముందుకు పోవాల్సి వస్తుంది. అలా ఒకరి నిర్ణయాలను ఆధారంగా జీవించాలి అనుకున్నప్పుడు, మనకు సరైన స్పష్టత(clarity) లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే నిర్ణయం మనదైనప్పుడే మనకు దాని పట్ల ఓ స్పష్టత(clarity) అనేది ఉంటుంది. స్పష్టత లోపిస్తే సరైన ఫలితాలు అందవు. ఉదాహరణకి, చేప నీళ్ళల్లో ఈదగలదు కానీ, చెట్టెక్కలేదు. ఒకవేళ చేప ఎవరో చెప్పారని నీళ్ళల్లో ఈదగలిగే తన సామర్థ్యాన్ని(capability ni) పక్కన పెట్టి, తనకి ఏ మాత్రం తెలియని చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తే అది బతికి బట్టకట్టగలదా? చెట్టు ఎక్కలేకపోతుందని అది ఎందుకూ పనికిరాదు అని మనం అనగలమా?

అంతేకాదు, స్పష్టత తో పాటుగా దేని లో అయినా రాణించాలంటే మనకు ఆ విషయం పట్ల జిజ్ఞాస (curiosity) ఉండాలి. అంటే, ఆసక్తి! ఆసక్తి లేకపోయినా మనం మన దృష్టిని దానిపై పూర్తి స్థాయిలో పెట్టలేం! అలా ఎక్కడైతే దృష్టి(focus), ఏకాగ్రత (concentration) లోపిస్తుందో, మనం పొందే జ్ఞానం కూడా అర్థ జ్ఞానమే అవుతుంది. అంటే Half Knowledge. అర్థ జ్ఞానం తో తరువాత ఏం చేయాలి అని చూసినా మనం సత్ఫలితాలను పొందలేము!

కాబట్టి, ఎవరి సామర్థ్యతని (capability ni) బట్టి, వారు తమ జీవితాన్ని రూపకల్పన (design) చేసుకోవాలి. అప్పుడే జీవితంలో సకాలంలో(in time lo) రాణించగలరు. అలాగే, మన ప్రతిభను ఆలస్యంగా గుర్తించినా కూడా నిరుత్సాహం(disappointment), పశ్చాతాపం తప్పా వేరే ఏ లాభం ఉండదు. ఎందుకంటే, గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేము కదా!

అయితే ప్రతిభను గుర్తిస్తే సరిపోదు... దాన్ని ఆధారం చేసుకుని మన జీవితాన్ని ఎలా ఉన్నతంగా తీర్చి దిద్దుకోవాలి కూడా తెలిసుండాలి! ముందుగా ఉన్న ప్రతిభను ఇంకా మెరుగు పరచుకోవాలి. తరువాత, మీ ప్రతిభను మీతో పాటుగా నలుగురూ గుర్తించాలి. అప్పుడే మీ ప్రతిభకు తగ్గ అవకాశాలు మీరు చేజిక్కించుకోగలుగుతారు. అంటే, దానికి సంబంధించి చేసే ప్రతీ పని మీరు నలుగురికీ ప్రదర్శింపచేయాలి(demonstrate cheyali), అలా అందరి దృష్టి మీ మీద పడేలా చేసుకోవాలి. అందుకు దోహదపడే(help aye) అన్నీ దారుల్ని మీరు తెలుసుకోవాలి, వాడుకోవాలి.

ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది సామాన్యులకి తమ ప్రతిభను చాటుకునేందుకు, కొత్త వారితో, సమాజంలో పలుకుబడి ఉన్నవారితో పరిచయాలు, సాన్నిహిత్యం(closeness) పెంచుకునేందుకు, అవకాశాలను కల్పించుకునేందుకు(create chesukunenduku) ఓ గొప్ప వేదికగా నిలిచింది. అలా పలురకాల మార్గాలను అన్వేషిస్తూ, వాటిలో సరైన మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగితే విజయం అనేది మన దరికి చేరుతుంది.

అయితే, ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత ప్రణాళికా బద్ధంగా(plan prakaram) ముందుకు సాగినా, ఎన్నో అడ్డంకులు రావచ్చు. కానీ, అలాంటప్పుడే మనం దృఢ సంకల్పంతో(determination) మొండిగా ముందుకు సాగితే మనం వాటిని జయించగలం. ఎదురయ్యే ఏ ఆటంకం(problem or obstacle) అయినా మన సంకల్ప బలం(determination) కంటే, మన పట్టుదల కంటే పెద్దది కాదు. జీవితంలో క్లిష్ట(tough times) సమయాల్లోనే సహనం(patience) అనేది అవసరం అవుతుంది. కాబట్టి, ప్రతికూల (negative situations) పరిస్థితులు ఎదురైనప్పుడు కాస్త సహనం వహిస్తే, విజయాన్ని మన నుండి ఎవరూ దూరం చేయలేరు!

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach

Launch your GraphyLaunch your Graphy
100K+ creators trust Graphy to teach online
UNIK LIFE 2024 Privacy policy Terms of use Contact us Refund policy