"చేతిలో డబ్బు ఉంటే... అన్నీ మన కాళ్ళ దగ్గరకి వస్తాయి" 

డబ్బు... నేడు ప్రపంచం మొత్తం దీని చుట్టూనే తిరుగుతుంది! 'పైసాయే పరమాత్మ!' అన్నట్టుగానే రాజు-పేద అంటూ తేడా లేకుండా అందరినీ నియంతలా శాసించే ఓ రంగు కాగితమే ఈ డబ్బు!

కడుపు నిండాలన్నా, ముఖాన కూసింత నవ్వు నిండాలన్నా, రోగం రాకుండా ఉండాలన్నా, వచ్చిన రోగం నయం కావాలన్నా, నిన్ను నలుగురూ గుర్తించాలన్నా, ఆ నలుగురూ నిన్ను కలకాలం గుర్తించుకోవాలన్నా, అదే నలుగురూ నువ్వు పోయాక కాటి వరకూ మోయాలన్నా డబ్బు అన్నది నీ చెంతన ఉండాల్సిందే!

చేతిలో డబ్బు ఉంటే... అన్నీ మన కాళ్ళ దగ్గరకి వస్తాయి. అందుకే, ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి మగ, మగువ అని తేడా లేకుండా దాన్ని సంపాదించడం కోసమే అందరి పరుగు, పోరాటం. కానీ, అందరి కథలు ఒకలా ఉండవు. సంపాదించడానికి సరైన మార్గాలు తెలియక, ఇటు వచ్చే పలురకాల ఖర్చులు తాళలేక అప్పులు చేస్తుంటారు చాలా మంది. అప్పులు చేయడం తప్పు కాదు... కానీ, వాటిని సకాలంలో ఎలా తీర్చాలో తెలుసుకోకపోవడం తప్పు. దాని వల్లే ఎందరో జీవితాలు నాశనం అవుతాయి.

జీవితాల పాలిట పెను భూతమైన అప్పు భారిన నుండి ఎలా బయట పడాలో తెలియాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి! ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం ఛానల్ ని subscribe చేసుకోండి!

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach