"Regret early to avoid regretting later when you can't change what happened!"
జీవితమేమి అనుకున్నంత పెద్దదేమీ కాదు! సుఖ-దుఃఖాలు, జయాపజయాలే కాకుండా, అనుకోని సంఘటనలు, పరిస్థితుల సమాహారమే జీవితం! ఇవన్నీ మనకి తెలుసు. కానీ, నిత్యం గుర్తుకు రావు. వచ్చినా ఈ క్షణం తీసిపారేస్తాం. ఎందుకంటే, కావాల్సినంత సమయం ఉన్నంతవరకూ దేని విలువ మనలో చాలా మంది తెలుసుకోలేము, గ్రహించలేం. తీరా సమయం అయిపోయాక, అయ్యో అలా చేసుంటే బావుండేది, ఇలా చేసుంటే బాగుండేది, ఇలా ఓ పశ్చాతాపం మొదలవుతుంది. పశ్చాతాపం అన్నది సమయం ఉన్నప్పుడే వస్తే మంచిది.
కాబట్టి, మనమేదో గొప్ప గొప్ప పనులు, త్యాగాలు చేయక్కర్లేదు. అవి ఎవరి వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటాయి. కానీ, ఓ మనిషిగా మనకు కనీసం మన జీవితం మీద గౌరవం, మనం చేసే చిన్న పనిలో అయినా నిజాయితీ, వీలైనంతగా నిర్లక్ష్యంగా లేకుండా ఉండగలటం.. ఇవి ఉంటే చాలు.
ఏదైనా కావాలి, సాధించాలి అనుకుంటే, ప్రాణం పెట్టి ప్రయత్నిద్దాం... వచ్చే ఫలితం గురించి కాదు, ఆ ప్రయత్నంలో మనం నేర్చుకునే పాఠం గురించి, తద్వారా మనం పొందే సంతృప్తి, ఆనందం గురించి. నిజంగా, మన ప్రయత్నంలో నిజాయితీ ఉంటే, ఫలితం ఎక్కడికి పోతుంది. ఒకవేళ వైఫల్యం ఎదురైనా, మనం నేర్చుకున్న పాఠం ఎలాగు ఉందిగా.. అదే మళ్ళీ సారి ప్రయత్నించినప్పుడు తప్పకుండ మనల్ని గెలిపిస్తుంది.
అలాగే, పొరపాటున కూడా 'ఇది నేను చేయగలుగుతానా?', 'ఇది నా వల్ల అవుతుందా?', 'ఎప్పుడూ ఏదోటి సమస్య వస్తుంది'... ఇలాంటి ప్రతికూల (
NEGATIVE) ఆలోచనలు చేయద్దు. మీరు ఎలా ఆలోచిస్తే, మీ జీవితం కూడా అలాగే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. పుట్టిన ప్రతీ ఒక్కరికి ఏదోక విషయంలో టాలెంట్ ఉంటుంది, అలాగే, ప్రతీ మనిషికి ఫలానా సాధించే సత్తా, సత్తువ ఉంటాయి. వాటిని గుర్తించి మెలగడమే నువ్వు చేయాల్సిన పని. వాటిని ఎంత త్వరగా నువ్వు గుర్తించగలిగితే, అంత త్వరగా నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలుగుతావ్, అలాగే నీకంటూ ఓ స్థిరత్వాన్ని (
STABILITY) పొందగలుగుతావు.
కాబట్టి, ఇప్పటి వరకు ఉన్న ప్రతి ప్రతికూల (NEGATIVE) ఆలోచనకి ఇక స్వస్తి పలుకు (PUT A FULLSTOP). లేదంటే, నువ్వు ఎప్పటికీ నువ్విలాగే మిగిలిపోతావు. కేవలం నీకు చివరికి ఆ పశ్చాతాపం తప్ప ఏమీ మిగలదు. అలా జరగకుండా ఉండాలి అంటే... Positive Thinking అనేది develop చేసుకోవాలి!
అది ఎలా అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ని పూర్తిగా చూడండి!
ఇలాంటి మరెన్ని విలువైన సమాచారం కోసం మా ఛానల్ ని SUBSCRIBE చేసుకోండి!