There are no items in your cart
Add More
					Add More
| Item Details | Price | ||
|---|---|---|---|
"భయం కన్నా భయంకరమైనది ఏదీ లేదు!"
జీవితంలో భయం కన్నా భయంకరమైనది ఏదీ లేదు. అది కోపానికన్నా ప్రమాదకరమైనది. ఆత్మవిశ్వాసం కలవాడు, దృఢ సంకల్పం కలిగినవాడు మనసులో భయానికి చోటు ఇవ్వడు. భయం దిగులును, బాధను, దుఃఖాన్ని, పిరికితనాన్ని. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. భయం శాంతిని, తృప్తిని, ఆనందాన్ని దూరం చేస్తుంది. ఉన్నది పోతుందేమో అని ఒకడికి భయమైతే, రావలసింది రాదేమోనన్న భయం మరొకడికి. ఇంటిగుట్టు రట్టయి పరువు పోతుందేమోనన్న భయం ఇంకొకడికి. తన సంపదను దోచుకుపోతారేమోనన్న భయం వేరొకడికి.
వేగంగా ఒంపులు తిరుగుతూ ప్రవహించే నదికి ఓ పర్వతమో, చెట్టో అడ్డం వస్తే ప్రవాహం అక్కడే ఆగుతుందా? పక్కదార్లు చూసుకొని పల్లంవైపు ప్రవహిస్తూ ముందుకెళ్లిపోతూనే ఉంటుంది. మనిషికి కూడా ఇలాగే ఎన్నో సమస్యలు, కష్టాలు, ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. అంతమాత్రాన మనిషి భయపడి కుంగిపోకూడదు. భయమనే వరదకు అడ్డుకట్ట వేయడానికి ధైర్యమనే ఆనకట్టను నిర్మించుకోవాలి అంటారు స్వామి వివేకానంద. భయంతో ఏ పనినీ సాధించలేం. నిగ్రహం, ఓర్పుతోనే (patience) ఎంతటి సమస్యనైనా అధిగమించగలం (overcome) మనోధైర్యంతో ముందుకు సాగడమే మన కర్తవ్యం.
అలాగే, తప్పు చేసే వాడే ప్రతీ దానికీ భయపడతాడు. ఏ తప్పు చేయనివాడు, క్రమశిక్షణతో మెలిగే వాడికి భయమే కలగదు. దైర్యవంతుడు అంటే భయం తెలియనివాడు కాదు, దాన్ని జయించినవాడు. భయం అనే శత్రువు మనలో లేనంతవరకు బయటి శత్రువేదీ మనల్ని భయపెట్టలేదు!
జీవితం ఓ యుద్ధం లాంటిది! పుట్టుక చావుల మధ్య ఎన్నో అవరోధాలు, ఆటంకాలు. మరెన్నో ఆటుపోట్లు. వీటన్నంటిలోనూ నీకు తోడుగా నిలిచేది, నిను గెలిపించేది నీ ధైర్యం!

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach