Think Twice Before You Speak!



ఓ మనిషి word, ఓ action, తీసుకునే ఓ decision... ఒకోసారి తన చుట్టూ ఉన్నవాళ్ళ మనసుల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతుంది, పరీక్ష పెడుతుంది, బాధ పెడుతుంది! 

అంటే, ఒక్క మనిషి వల్ల ఇంతమంది ఇబ్బందికి గురవుతారు అన్నమాట!

అయితే ఇప్పుడు ఏ మనిషికైనా బాగా అవసరమైంది ఏంటి? ఆత్మ సంతృప్తి - Self Satisfaction.

'ఉన్నంతలో happy గా, comfortable గా, healthy గా జీవించి వెళ్ళిపోతున్నామా..?' 

ఇదే చివరి క్షణంలో మన మదిలో మెదిలే ఆలోచన. దీనికి సరైన సమాధానం మన దగ్గర ఉంటే సరే... లేకపోతే?

నా వరకు సంతోషానికి మించిన ఐశ్వర్యం, సంతృప్తికి మించిన సౌకర్యం మరొకటి లేవు! 

కానీ, అవే దొరకడం కష్టం అయితే? అసలు, అలా అవ్వడానికి కారణమైన పరిస్థితులు, మనుషులు మన కంటి ముందు కనిపిస్తూనే ఉంటాయి, ఉంటారు. కానీ, మనం ఒకోసారి నిస్సహాయులుగా మిగిలిపోతాం! ఏవో బలహీనతలు, సిద్ధాంతాలు మనల్ని ప్రతిస్పందించకుండా ఆపేస్తాయి!

అందుకే, ఎవరైనా సరే.. వారి మాట, చర్య, నిర్ణయం.. వారి చుట్టూ ఉన్నవాళ్లపై, వాళ్ళ మనసులపై ప్రభావం చూపేవి, బాధించేవి అయితే మాత్రం ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి, ప్రవర్తించండి, నిర్ణయించండి!

Venu Kalyan
Founder of Unik Life.Com | Life & Business Coach