"మనిషంటే ద్వేషం కాదు దేవుని వేషం!"

ఈ రోజుల్లో ఎక్కడ చూసినా గొడవలు, వాగ్యవాదాలు. అర్థం పర్థం లేని చర్చలు, కొట్లాటలు, హింస! సామజిక మాధ్యమాలు, టీవీ ఛానళ్లు, పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, కార్యాలయాలు, ఇలా ప్రతీ చోట మతం పేరుతో, కులం పేరుతో, వర్గాల పేర్లతో, పార్టీల పేర్లతో, ఆఖరికి సినిమా హీరోల పేర్లతో తిట్టుకుంటూ, కొట్టుకుంటూ సమయాన్ని వృధా చేయడమే కాకుండా, ద్వేషాన్ని పెంచుకుంటున్నారు, పంచుతున్నారు. చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, పెద్ద చిన్న, పేద ధనిక అని తేడాలు లేకుండా అందరూ (ఎవరో కొంతమంది విచక్షణ కలిగిన వాళ్ళు తప్ప) ఇదే చేస్తున్నారు.

మనమంతా భారత మాత బిడ్డలం...
మనమంతా అన్నదమ్ములం, భారతీయులం...
మనలో మనకే ఎందుకు యుద్ధం...
అర్ధంలేని, అనర్థాలు (Nonsense) తెచ్చే గొడవలతో బ్రతుకుట వ్యర్థం!
అడిగి చూడు నీ మనసుని, చెప్పలేదా అది నీకు తప్పని...
కులం పేరుతో, మతం పేరుతో మచ్చలేని ఈ పుణ్యభూమిని (holy country)...
నెత్తుటితో తడుపుతున్నామని, రక్త కన్నీరు పెడుతుందిరా భారతావని (MotherIndia)...
తన కన్నీరు చూసైనా మారతామని, తల్లి కంట నీరు తుడిచేందుకైనా ఒక్కటవుతామని!

కులమని, మతమని, లేని గందరగోళాలను సృష్టించి, అశాంతి మంత్రాలను స్మరించి, తానొక మనిషనే సంగతినే విస్మరించి (Forgetting), బేధాలను (Difference) తెచ్చి, విబేధాలను (Disagreements)పెంచి, భూమాత హృదయాన్ని ముక్కలుగా తెంచి, ఆమె నెత్తుటితో తడిచిన మట్టితో ఎక్కడికక్కడ సరిహద్దులు నిర్మించి, స్వేచ్ఛను వధిస్తూ (killing freedom), సిగ్గులేని, బుద్ధిలేని, నీతిలేని, పాపభీతి లేని (No fear of sin), మనసులేని, అసలు మనిషికాని మనుషులు చెప్పే చెప్పుడు, తప్పుడు మాటల మాయలో మనిషివైన నీవు, మనసున్న మనిషివైన నీవు పడకుండా, చెడకుండా, కుల మతాలకు అతీతంగా సాటి మనిషిని గౌరవిస్తూ, ప్రేమిస్తూ, నీతో మొదలయ్యే మార్పుకి తెర తీస్తూ, ముందుకు అడుగులు వేసే నీకు తోడుగా నేనూ ఉన్నానని గుర్తు చేస్తూ, మన అడుగులతో జత కలిసే మరెన్ని అడుగులను ఆహ్వానిస్తూ, సంపూర్ణమైన "మార్పు"ని ఆకాంక్షిస్తూ, చివరిగా నేను చెప్పేది ఒక్కటే ...

మనిషంటే...
విడదీస మతం కాదు, కలిసుండాలనిపించే అభిమతం...
అహంకారం కాదు మమకారం....
పంతం కాదు బంధం....
క్రూరత్వం కాదు ప్రేమ తత్వం....
పెరిగే కక్ష కాదు వెలిగే రక్ష....
ద్వేషం కాదు దేవుని వేషం!

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach