పాఠశాల, కళాశాల... మనిషి జీవితంలో ఊహ తెలిసిన దగ్గర నుండి దాదాపు 20 సంవత్సరాలు వీటిల్లోనేన ఎక్కువ సమయం గడుపుతాడు. కానీ, ఇక్కడ బోధించే పాఠాలు ఎంతవరకు తరువాతి మన జీవితానికి ఉపయోగపడుతున్నాయి? ఎంతవరకు మనకి ఓ మార్గం చూపిస్తున్నాయి? ఎంతమంది చదువు పూర్తి చేసుకుని, బయట ప్రపంచంలోకి అడుగు పెట్టిన తరువాత ఎంతమంది సరైన ఉద్యోగాలు లేక, ఏం చేయాలో పాలుపోక, దిక్కు తోచని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారు?

ఎంతసేపూ విద్యార్థుల్ని మార్కులు, పాయింట్ లు ని సృష్టించే యంత్రాల్లా తయారుచేస్తున్నారు తప్ప... వాళ్ళని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని, వాళ్ళ జీవితాలని వాళ్లే తీర్చుదిద్దుకోగలిగే సమర్థతవంతులుగా చేయలేకపోతున్నారు. కాబట్టి, ఈ విద్యావ్యవస్థ ఎప్పటికీ మారుతుందో తెలీదు! మరి అలాంటప్పుడు ఏం చేస్తే మనం మనకంటూ ఓ బంగారు భవిష్యత్తుని నిర్మించుకోగలం? అందుకు సమాధానమే ఈ వీడియో.

మనం ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తామో, మన కెరీర్ ని మంచిగా డిజైన్ చేసుకోగలుగుతామో తెలియాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి!

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach